![]() |
![]() |
.webp)
కామన్ మ్యాన్ సెలెబ్రిటీ అయ్యాడు. ఇప్పుడు మోస్ట్ పాపలర్ తెలుగు పర్సన్ అయ్యాడు. అతనే ఆదిరెడ్డి. ఇతను బిగ్ బాస్ సీజన్-6 తో ఫేమస్ అయ్యాడు. ఒక కామన్ మ్యాన్ గా, ఒక రివ్యూయర్ గా బిగ్ బాస్ సీజన్-6 లోకి ఎంట్రీ ఇచ్చిన ఆదిరెడ్డి.. తన మైండ్ గేమ్ తో గట్టి పోటీ ఇవ్వటమే కాకుండా, హౌస్ లో మంచి ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చాడు.
బిగ్ బాస్ హౌజ్ లో ఆదిరెడ్డికి డ్యాన్స్ రాకపోయినా కానీ హోస్ట్ నాగార్జున డ్యాన్స్ చేయమనగానే చేసేసాడు. అది చూసి అందరూ నవ్వుకున్నారు. బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ అందరి స్క్రీన్ టైం తో పోలిస్తే ఆదిరెడ్డి స్క్రీన్ మీద ఎక్కువగా కనిపించే వాడు. హౌస్ లో ఆదిరెడ్డి ఉన్నప్పుడు ఒక వీక్ లీడర్ అయ్యాడు. కామన్ మ్యాన్ రివ్యూయర్ అయ్యాడు, రివ్యూయర్ టీం లీడర్ అయ్యాడని నాగార్జున చెప్పగానే ఆ వారం అంతా ఆదిరెడ్డి ట్రెండింగ్ లో ఉన్నాడు. హౌజ్ లో ఉన్నన్ని రోజులు గీతుతో స్నేహం చేసిన ఆదిరెడ్డి.. మిగతా కంటెస్టెంట్స్ తో అంతలా కలవలేకపోయాడు. హౌస్ లో ఫ్యామిలీ వీక్ జరిగినప్పుడు వాళ్ళ పాప అద్విత రావడం.. తనని చూసి ఆదిరెడ్డి ఎమోషనల్ అవ్వడం.. తన భార్య కవితకు ఐ లవ్ యూ అని చెప్పడం.. ఇదంతా ఒక బ్యూటిఫుల్ మెమోరీగా ఉందని చెప్పాడు ఆదిరెడ్డి.
బిగ్ బాస్ తర్వాత తన యూట్యూబ్ ఛానెల్ లో సబ్ స్క్రైబర్స్ కూడా పెరిగారు. ఇంకా ఇన్ స్ట్రాగ్రామ్ లో 324K ఫాలోవర్స్ ని కలిగి ఉన్నాడు. భార్య కవితతో కలిసి ఆదిరెడ్డి చేసే రీల్స్, వ్లాగ్స్ నెట్టింట రెగ్యులర్ గా ఫుల్ వైరల్ అవుతుంటాయి. ఐపీఎల్ లో రివ్యూ లు చెప్తూ .. తరచుగా గ్రౌండ్ కి వెళ్ళి క్రికెటర్ లతో కలిసి ఫోటోలు దిగుతూ.. ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటున్నాడు. ఇప్పుడు తాజగా తన భార్య కవితతో కలిసి మలేషియా వెళ్ళాడు. అక్కడ ఉన్న హిందూ టెంపుల్ ని దర్శించుకున్నాడు. అక్కడ తీసుకున్న ఓ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా .. అది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. మలేషియాలో ఉన్న లోకల్ తెలుగు వాళ్ళు కూడా కలుద్దామని ఆ పోస్ట్ కి కామెంట్ చేస్తున్నారు.
![]() |
![]() |